హైడ్రామాలు ఆపండి…!

తాండూరు రాజకీయం వికారాబాద్

హైడ్రామాలు ఆపండి…!
– బీసీ బిల్లుపై స్వార్థ రాజకీయాలోద్దు
– కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ల వైఖరిలు విడ్డూరం
– చిత్తశుద్ది ఉంటే రిజర్వేషన్లను అమలుకు శ్రద్ద చూపండి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల పట్ట, బీసీల రిజర్వేషన్ల పట్ల హైడ్రామాలు ఆపాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మండిపడ్డారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

రాజకీయ లబ్దికోసమే బీసీ బిల్లును అడ్డం పెట్టుకుని ద్వంద వైఖరిని ప్రదర్శిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును రాష్ట్ర శాసన సభ మండలిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందినప్పటికి గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూడాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణలో 56శాతం ఉన్న బీసీలకు ఉద్యోగాలలో 29శాతం, స్థానిక సంస్థల్లో 21 రిజర్వేషన్లను మాత్రమే అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై చర్యలు తీసుకోకవడం, దానిపై కాంగ్రెస్ విమర్శలు చేస్తూ లబ్దిపొందుతోందని అన్నారు.

అదేవిధంగా బీసీ బిల్లుపై ఒకప్పుడు మద్దతు తెలిపిన బీజేపీ కేంద్రంలో 9వ షెడ్యూల్ లో చేర్చడాని ఆసక్తి చూపకం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా బీసీ బిల్లును అమలు చేస్తే ముస్లింలు లాభపడతారని పేర్కొంటుండంపై అసంతృప్తి వ్యక్త చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన కుటుంబ సర్డేలో బీసీ డేటాను అందుబాటులో ఉంచకపోవడంపై బీజేపీ, | బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేస్తూ బీసీ బిల్లుపై స్పష్టత ఇవ్వకుండా దాటవేస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లు హైడ్రాలు ఆపాలని అన్నారు. బీసీలపై ఏమాత్రం చిత్త శుద్ది ఉంటే బీసీ బిల్లు అమలుపై శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని పార్టీలకు బీసీలు గుణపాఠం చెప్పి తీరుతారని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి..

బీసీ బిల్లు కోసం ఢిల్లీకి వెళ్తాం..!