అబ్బుర పరిచిన గణిత అవధానం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

అబ్బుర పరిచిన గణిత అవధానం
– కళ్లకు గంతలు కట్టుకుని జవాబులు
– ఉత్సహా పరిచిన రిటైర్డ్ టీచర్ అనంతప్ప
– ఆశ్చర్య పోయిన విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో నిర్వహించిన గణిత అవధానం విద్యార్థులను, ఆచార్యులును అబ్బుర పరిచింది.
kvcs
యాలాల మండలం కోకట్ గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ అనంతప్ప ద్వారా గురువారం పాఠశాలలో గణిత అవధానం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతప్ప శతావధానంలో విద్యార్థులు చెప్పిన వస్తువులు, జంతువులు, వాహనాలు, ప్రముఖ పేర్లను బోర్డుపై రాయించారు. అనంతరం ఆయన కళ్లకు గంతలు కట్టుకుని బోర్డుపై రాసిన 100 పేర్లలో ఎటునుంచి ఏది అడిగినా చూడకుండానే చెప్పి అందరిని ఆశ్చర్య పరిచారు.

ఇందులో టెక్నిక్ లను విద్యార్థులకు వివరించి వారి మెమోరి పవర్ కాపాడుకోవాలో వివరించారు. విద్యార్థులు కూడా మెధావుల్లా ఎదగవచ్చని తెలిపారు. పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ గణిత అవధానం చేసిన అనంతప్ప ప్రారంభంలో శిశుమందిరంలోనే ఉపాధ్యాయులుగా పనిచేసినట్లు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు విజయలక్ష్మీ, కార్యదర్శి అనంత్ రెడ్డి, కోశాధికారి రాంరెడ్డి, ఆచార్య, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కొత్త కమీషనర్‌ జాయినింగ్..!