అన్నా.. ఆశీర్వదించు..!
– ఎమ్మెల్సీని కోరిన ఎమ్మెల్యే పైలెట్
– ఒక్కటైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
– ఒక్కసారిగా మారిపోయిన పరిణామాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: అన్నా ఆశీర్వదించు.. అని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని కోరారు. వికారాబాద్ జిల్లాలో వర్గపోరులో బ్రాండ్ సింబల్‌గా ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు ఒక్కటయ్యారు. అవును మీరు చదివింది నిజమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. సీఎం కేసీఆర్ సమక్షంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు ఒక్కటైపోయారు. ఇద్దరిని ఏకం చేయడంలో చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మద్యవర్తిత్వం చేశారని టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో మండిపడిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు ఒక్కటి కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రగతి భవనలో సీఎం కేసీఆర్ సమక్షంలో భేటి అయిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో కూడా కలిసినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్, తెలంగాణ భవన్ ఎపీసోడ్ల తరువాత మరో అసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టిక్కెట్టు దక్కించుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాళ్లు మొక్కు అన్నా ఆశీర్వదించూ అని కోరారు. అంతేకాకుండా పాతవి ఏమైనా ఉంటే మనుసులో పెట్టుకోవద్దని అన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని కలిసి వచ్చే ఎన్నికల్లో తనకు తోడ్పాటు అందించాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్సీ అనుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సమయంలో బీఆర్ఎస్ నేత కరణం పురుషోత్తంరావు అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే వెంట సీనీయర్ నేతలు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఎమ్మెల్యే సోదరుడు రితేష్ రెడ్డి, నాయకులు విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలను నేతలు సన్మానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తాండూరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇది కూడా చదవండి..

