మున్సిపల్ కమీషనర్‌ జోరు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మున్సిపల్ కమీషనర్‌ జోరు..!
– రెండే రోజే ఫీల్డ్ దిగి.. వార్డుల పర్యటన
– సీజనల్ వ్యాధులపై ప్రజలకు అప్రమత్తం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి జోరు కనబరుస్తున్నారు. విధుల్లో చేరిన రెండో రోజే తాండూరు పట్టణంలోని వార్డులలో పర్యటించారు.
kvcs
సీజనల్‌ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని 11వ వార్డులో మున్సిపల్ కమీషనర్ యాదగిరి పర్యటించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వార్డులో మురుగు కాలువల పరిశుభ్రం, వాటర్ ట్యాంకుల నిర్వహణ, చెత్త తొలగింపు పనులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో దోమల వ్యాప్తి చెందకుండా మున్సిపల్ నుంచి మందులను పిచికారి చేయించారు.

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల నియంత్రణ కోసం జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్ వెంకటయ్య, ఈఈ ప్రవీణ్ కుమార్, వార్డు ఆఫీసర్, జవాన్లు వీరన్న, బొట్టు శ్రీను, తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కరుణించు.. ఎల్లమ్మ తల్లీ..!