‘చెప్పు’కునే పనే చేశారుగా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

‘చెప్పు’కునే పనే చేశారుగా..!
– మున్సిపల్‌లో ఇదో.. అవినీతి మాయ
– రేటు మార్చి.. ఏమార్చే ప్రయత్నం
– బయటపడిన మరో బాగోతం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్‌లో అవినీతి మారడం లేదు. అన్ని విభాగాల్లో అధికారులు అవినీతికి మరిగారని ఆరోపణ మచ్చలు వెంటాడుతూనే ఉన్నాయి.
kvcs
ఇదిలా ఉండగా మున్సిపల్‌లో అధికారులు మరో అవినీతి గురించి ‘చెప్పు’కునేలా చేశారు. గత జూన్ మాసంలో తాండూరు మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం వస్తువులు కొనుగోలు చేసేందుకు రూ. 50లక్షలు టెండర్లు వేశారని.. ఇందులో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి యేడాది కార్మికులకు రెండు జతల బట్టలు, కొబ్బరి నూనే, చెప్పులు, బెల్లం వాటి వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే మున్సిపల్ కార్మికులకు అవసరమయ్యే వస్తువులు అందించేందుకు రూ. 50లక్షలతో టెండర్లను ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.

కొన్ని రోజుల తరువాత ఆ సంగతిని పక్కన పెట్టారు. ఈలోగా టెండర్లు ఆహ్వానించి తీసుకవచ్చిన వస్తువుల ధరలను తారుమారు చేశారని తెలిసింది. ఇందుకు సాక్షంగా మున్సిపల్‌ అధికారులు చేసిన పని వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై కార్మికుల కోసం తెచ్చిన చెప్పులపై రెట్లు(ధరలు) కనిపించకుండా పనిచేశారు. చెప్పులపై రేట్లు ఉన్న చోట తెల్లని పేయింట్ రుద్దారు. చెప్పులు తీసుకున్న కార్మికులు గమనించి ఇదేం పని అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. బెస్ట్ అనే కంపెని పేరుతో అందించిన చెప్పులపై పేయింట్లు రుద్ది రేట్లు కనింపించకుండా చేయడంపై పెదవి విరుస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో చెప్పుకునే పనే చేశారంటూ వంగ్యాస్త్రాలు వేస్తున్నారు. ఇప్పటికైనా అధికారుల తీరులో మార్పు ఎలా వస్తుందో ఆర్థం కావడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

గణనాథుల సేవలో బీఎస్ఆర్..!