కాంగ్రెస్, బీజేపీలవి కుమ్మక్కు రాజకీయాలు
– భయమెరుగని బీఆర్ఎస్ భూస్థాపితానికి కుట్రలు
– మోడి, రాహుల్, రేవంత్‌లు తెలంగాణ దొంగలు
– ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మేది లేదు
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనే కుట్రలతో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ విమర్శించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగంను బీజేపీ ఉల్లంఘిస్తుందని రాహుల్ గాంధీ ఉద్యమాలు చేస్తుంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అదే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని అన్నారు. సీబీఐ. ఈడీ, ఐటీ శాఖలు ప్రధాని నరేంద్రమోడి జేబు సంస్థలు అని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకు ఇస్తామని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న కాగ్ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదని పేర్కొంటే.. తెలంగాణలో పీసీ ఘోస్ కమిషన్ ఏర్పాటు చేసిందని, అందులో కూడా ఏమి లేదని తెలిసి.. సీబీఐకి అప్పగిస్తామని కొత్త కుట్రకు పూనుకుటుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 13 జిల్లాల ప్రజలు, రైతులు తాగునీరు, సాగునీరు పొంది సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐకి వెళ్లి ఏం సాధించుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజీపీల నుంచి మోడి, రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిలు తెలంగాణ దొంగలుగా మారారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనే కుట్ర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. 14 ఏండ్లు పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీపై పిచ్చి ప్రయత్నాలు ఫలించలేవని, భయం ఎరుగుని బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని ద్వజమెత్తారు. భూప్రపంచం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉంటడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రం శ్రీధర్, దత్తాత్రేయరావు ఉన్నారు.

ఇదికూడా చదవండి….

