మత్తు వీడి.. చూడండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మత్తు వీడి.. చూడండి..!
– అభివృద్ధి, సేవ కనిపిస్తోంది
– బుయ్యని ఫ్యామిలీపై బురధ రాజకీయాలు తగవు
– కాంగ్రెస్ యువనాయకులు వికాష్‌ జోషీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో జరుగుతున్న అభివృద్ధి చూడాలంటే గులాబీ పార్టీ నేతలు మత్తు వీడి చూడాలని కాంగ్రెస్ పార్టీ యువనాయకులు వికాష్‌ జోషి అన్నారు.
kvcs
మంగళవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు బుయ్యని కుటుంబంపై చేసిన ఆరోపణలను ఖండించారు. బుయ్యని కుటుంబ సభ్యులు ఈ రోజు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదని. ప్రజాసేవలో, దేశ సేవలో నిస్వార్థంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఇసుక, ఎర్ర మట్టి తవ్వకాలు ఎలాంటి అక్రమం కావు. ప్రభుత్వ అనుమతులతో, డీడీ పేమెంట్ ద్వారా పూర్తిగా లీగల్‌గా జరుగుతున్నాయని అన్నారు. దాంతో పాటు ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయం చేరుతోందని అన్నారు.

“షాడో ఎమ్మెల్యే, సెకండ్ ఎమ్మెల్యే” అంటూ మాట్లాడటం అర్థరహితమని మండిపడ్డారు. ప్రజా పాలనలో అందరూ ఎమ్మెల్యేలే, అందరూ ప్రజాసేవకులే. అభివృద్ధి కోసం ఎవరినైనా కలవడం, విన్నపించడం సహజం. దాన్ని తప్పుగా చూపించి బురద జల్లే ప్రయత్నం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుగా మత్తు నుంచి బయటపడాలని, అదే ఫామ్ హౌస్ వేదికల నుండి అదే పాత మాటలు, అదే చెల్లని ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక ఫలించవు అన్నారు.

ఇదికూడా చదవండి….

కాంగ్రెస్, బీజేపీలవి కుమ్మక్కు రాజకీయాలు