
సంక్షేమానికి పెద్దపీట..!
– అదే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో పేదల సంక్షేమం ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాల కింద నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 96 మందికి మంజూరైన చెక్కుల పంపిణీతో పాటు సీఎంఆర్ఎఫ్ పథకం కింద 119 మందికి మంజూరైన ఎల్ఓసీల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ఆయా మండలాల లబ్దిదారులకు రూ. 96లక్షల 11 వేల 136ల కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా 39లక్షల 79 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి, ఆరోగ్యానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు. ఈ పథకాలను అర్హులైన పేదలందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్. మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, బీసీ సెల్ జిల్లా నాయకులు ఉత్తమ్ చంద్, నాయకులు అబ్దుల్ రవూఫ్, వడ్డె శ్రీనివాస్, బంటు మల్లప్ప, మసూద్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్, మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జన్నె నాగప్ప, తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్, పలు శాఖల అధికారులు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

