మహిళా సమాజానికి స్పూర్తి సరళా శ్రీనివాస్ రెడ్డి
– బషీరాబాద్ మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్
– సరళారెడ్డికి బెస్ట్ అవార్డుపై అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో మహిళ సమాజానికి తాండూరుకు చెందిన బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి స్పూర్తిగా నిలుస్తున్నారని బషీరాబాద్ మండల మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ అన్నారు.

కాంగ్రెస్ నాయకురాలు, ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల్లోనే బెస్ట్ ఎక్సలెన్స్ బిజినెస్ -2025 అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆదివారం బుయ్యని సరళారెడ్డిని ఆమె నివాసంలో బషీరాబాద్ మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. బెస్ట్ అవార్డు పొందడం పట్ల సరళారెడ్డిని సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కృషి, పట్టుదల, అంకితభావం ఉంటే మహిళలు ఏ రంగాల్లో అయినా రాణించగలుగుతారని సరళా రెడ్డి నిరూపించారని అన్నారు. సరళారెడ్డి మహిళ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నవాంధీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, చందర్ నాయక్ లు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

