దిడ్డి వాగులో వ్యక్తి గల్లంతు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

దిడ్డి వాగులో వ్యక్తి గల్లంతు..!
– సంగెంకలాన్ గ్రామంలో ఉద్రిక్తత
– కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
డ అప్రమత్తమైన అధికారులు, గాలింపు చర్యలు ముమ్మరం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
kvcs
ఉదయం నుంచి మండలంలో భారీ వర్షం కురిసింది. వర్షాల వల్ల సంగెంకలాన్ గ్రామ సమీపంలోని దిడ్డి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. సాయంత్రం వేళ గ్రామానికి చెందిన మొగులప్ప అనే వ్యక్తి పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా వాగులో గల్లంతు అయినట్లు గ్రామంలో ప్రచారం జరిగింది. డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ ఆయన గ్రామంలో సంఘటన చోటు చేసుకోవడంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెంటనే వికారాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల దృష్టికి తీసుకెళ్లారు. వారు తాండూరు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో తహసీల్దార్, రూరల్ సీఐ నగేష్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు గత యేడాది వరధల వల్ల గ్రామంలో ఇదే వాగులో మొగులప్ప సోదరుడు పెంటప్ప కూడా గల్లంతు అయి మృతిచెందాడు. తాజాగా మొగులప్ప కూడా ఇదే వాగులో గల్లంతు కావడం విషాధంగా మారింది. మొగులప్పకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

ఇదికూడా చదవండి…

గ్రూప్-1 పరీక్ష దొంగలెవరో తేల్చాలి