గల్లంతు.. విషాధం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

గల్లంతు.. విషాధం..!
– శవమై లభ్యమైన మొగులప్ప
– చెట్టినాడు ఫ్యాక్టరీ మార్గంలో గుర్తింపు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామం వాగులో మొగులప్ప గల్లంతు విషాధంగా ముగిసింది. వాగులో కొట్టుకుపోయి శవమై లభ్యమయ్యాడు.
kvcs
గురువారం ఉదయం నుంచి మండలంలో భారీ వర్షం కురిసింది. వర్షాల వల్ల సంగెంకలాన్ గ్రామ సమీపంలోని దిడ్డి వాగు ఉదృతంగా ప్రవహించింది. సాయంత్రం వేళ గ్రామానికి చెందిన మొగులప్ప అనే వ్యక్తి పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా వాగులో గల్లంతు అయిన సంగతి తెలిసిందే. డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాలతో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పోలీసులు, రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శుక్రవారం ఉదయం గ్రామస్తులు వాగు వరధ ఉదృతి తగ్గడంతో గాలింపు ప్రారంభించారు. సంగెంకలాన్, చెట్టినాడ్ సిమెంట్ కర్మాగారం మార్గంలో మొగులప్ప మృతదేహం కనిపించింది. వాగు ప్రవాహా మార్గంలోని ఓ చెట్టుకు కొట్టుకుపోయి మొగులప్ప మృతి చెంది కనిపించాడు. గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించి మృతదేహాన్ని బయటకు తీసే పనులు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదికూడా చదవండి…

దిడ్డి వాగులో వ్యక్తి గల్లంతు..!