
రేపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం..!
– పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో ఏర్పాట్లు
– పీపుల్స్ కాలేజీ పూర్వ విద్యార్థులకు ఆహ్వానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒకే చదువుకుని.. జీవితాల్లో స్థిర పడిన తరువాత మళ్లీ కలుసుకునే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఓ పండగే. ఈ పండగ సంతోషాన్ని నింపేందుకు తాండూరుకు చెందిన రాజకీయ నాయకులు పట్లోళ్ల నర్సింలు సంకల్పించారు.

ఆయన ఆధ్వర్యంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కళాశాలలో 1988-91 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. తాండూరు మండలం అంతారంలోని పట్లోళ్ల నర్సింలు ఫాంహౌస్‌లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 35 ఏండ్ల తరువాత కలుసుకుంటున్న సందర్భంగా రాజకీయ, వ్యాపార, ఉద్యోగాలతో పాటు వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు అందరు హాజరై విజయవంతం చేయాలని పట్లోళ్ల నర్సింలు విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

