బీసీ రిజర్వేషన్ల కోసం ఏకం అవ్వాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీ రిజర్వేషన్ల కోసం ఏకం అవ్వాలి
– కాంగ్రెస్ న్యాయపోరాటానికి మద్దతు ఇద్దాం
– తాండూరు న్యాయవాది కె.గోపాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం అందరు ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.గోపాల్ అన్నారు.

శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ 42శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు స్టే విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు అడ్డంకులు రావడం విచారకమన్నారు. బీసీ రిజర్వేషన్లకు అడ్డంకులు రావడంతో బీజేపీ కారణమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం చేస్తున్న రాజకీయ పోరాటానికి అందరు మద్దతు ఇవ్వాలన్నారు.
kvcs
దశాబ్దకాలంగా రాని ఒక గొప్ప అవకాశం తెలంగాణ బహుజనులకు వచ్చిందని, దాని కోసం కోర్టు తీర్పులతో కాని, మరే ఇతర పెంతరాల పేరుతో ఆపకుండా ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు. బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడం మన హక్కు అని అన్నారు. బీసీ నాయకులు పార్టీల అగ్ర నాయకులను మెప్పించడానికి కాకుండా ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా పోరాటం చె యాలన్నారు. అందరు ఏకమై బీసీ రిజర్వేషన్లను సాధించుకుందామని అన్నారు.

ఇదికూడా చదవండి…

సర్కారు వైద్యానికి గులాం..!