కాంగ్రెస్ బలోపేతంలో కార్యకర్తలే కీలకం
– వారి అభిప్రాయ సేకరణతో డీసీసీ ఎన్నిక
– ఏఐసీసీ ఇంచార్జ్ సూరజ్ సింగ్ ఠాకూర్
– డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ
– తాండూరులో సంస్థాగత నిర్మాణ జిల్లా స్థాయి సంఘటన్ సృజన్ అభియాన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమైందని ఏఐసీసీ ఇంచార్జ్ సూరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ జిల్లా స్థాయి సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం అట్టహాసంగా నిర్వహించారు.

తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలోని వెంకోబా గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్ సూరజ్ సింగ్ ఠాకూర్ తోపాటు డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ బెల్లయ్య నాయక్, ఫైనాన్స్ కమీషన్ మెంబర్ రమేష్ మహరాజ్, ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత తదితరులు హాజరయ్యారు. డీసీసీ అధ్యక్ష ఎన్నికలో భాగంగా తాండూరు నియోజకవర్గం నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, బీసీ సెల్ నాయకులు ఉత్తమ్ చంద్. శంకరప్పలు డీసీసీ పదవి కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

అనంతరం బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం కొనసాగించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ సూరజ్ సింగ్, డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి కార్యకర్త సైనికుడే అని అన్నారు. వారి అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, వివిధ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

