వెనుకబడిన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం
– ముదిరాజ్‌లను బీసీ ఏ లోకి మార్చేందుకు కృషి
– రానున్న రోజుల్లో తాండూరు తలరాత మారబోతోంది
– వాగ్దానం చేసిన పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
– తాండూరులో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
– అట్టహాసంగా క్రీడాకారులకు కిట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోన్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతోందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ముదిరాజ్ భవన నిర్మాణ శంకస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రి వాకిటి శ్రీహరి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై భవన నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.

రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రతో అన్ని వర్గాలకు ” హక్కులు దక్కాలని సంకల్పాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందిపుచ్చుకుని రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసం కులగణన చేయించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ ల వల్ల ఇతర కులాలకు ఇబ్బందులు కలుగుతాయని గత ప్రభుత్వాలు లెక్కలను బహిర్గతం చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముదిరాజ్ లను బీసీ డీ నుంచి ఏ లోకి మార్చేందుకు భుజస్కంధాలపై వేసుకుని కృషి చేస్తానని స్పష్టం చేశారు. అదేవిధంగా తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా ఐదు శాఖలను అప్పగించారని అన్నారు. రాష్ట్రంలో ని 26వేల చెరువుల్లో చేప పిల్లలను పంపిణీ చేసి మత్య్స సంపదను పెంచేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. దీంతో పాటు పశు, పాడి సంస్థను వృద్ధిలోకి తెచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ముదిరాజ్ లతో పాటు బీసీ, వెనుకబడిన వర్గాల వారందరు చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో తాండూరు తలరాత మారబోతో ందని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు.

తాండూరులో రూ. 5 కోట్లతో క్రీడా మైదానాన్ని మంజూరు చేయిస్తామని హామి ఇచ్చారు. అంతేకాకుండా రూ.2కోట్లతో 2 ఎకరాలలో సెట్ విన్ సంస్థను ఏర్పాటు చేసి యువతకు, మహిళలకు వృత్తి నైపుణ్యాలు మెరుగు పరిచేవిధంగా తోడ్పాటు అందిస్తానని అన్నారు. సెట్ విన్ సంస్థ సర్టిఫికెట్లు పొందిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. యువత మత్తు. గంజాయిని వీడి క్రీడా మైదానాల్లోకి రావాలని, అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మరోవైపు తాండూరులో నిర్మిస్తున్న ముదిరాజ్ ల భవనం నిర్మాణం పూర్తికి తమవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని హామి ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తానని అన్నారు.

తాండూరు రూపురేఖలు మారుస్తా
అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరిల సహాకారంతో తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ముదిరాజ్ లు, మత్య్సకారుల అభివృద్ధికి అండగా ఉంటామని అన్నారు. ఎన్నికల్లో హామి ఇచ్చిన విధంగా మార్పు తీసుకవస్తామన్నారు. రోడ్లు, ఇతర సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గతంలో ఎన్నడు జరిగని అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రోడ్లకు, ఇరిగేషన్ శాఖలకు రూ.1000 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. బైపాస్ రోడ్ల పూర్తికి రూ.30కోట్ల పరిహారం వచ్చే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. గత పాలకుల వల్ల తాండూరు అభివృద్ధిలో వెనుకబాటుకు గురైందని విమర్శించారు.
క్రీడాకారులకు కిట్ల పంపిణి
మరోవైపు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల తాండూరు నియోజకవర్గంలోని క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు. తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 40 జట్లకు క్రీడా కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కార్పోరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, స్పోర్ట్ ఆథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి. మత్స్య కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, స్టేట్ ఫైనాన్స్ కమీషన్ మెంబర్ ఎం. రమేష్ మహరాజ్, ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్, నాయకులు డా. సంపత్ కుమార్, వడ్డె శ్రీనివసా, పెద్దేముల్ మాజీ వైస్ చైర్మన్ మధులత శ్రీనివాస్ చారి, మాజీ కౌన్సిలర్లు పట్లోల్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్, వివిధ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

