వచ్చే యేడాదే కొత్త స్టేషన్…!

టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

వచ్చే యేడాదే కొత్త స్టేషన్…!
– వేగవంతంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు
– సికింద్రాబాద్ ఏడీఆర్ఎం ముత్యాల నాయుడు
– తాండూరులో అమృత్ పనుల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే యేడాది మార్చిలోగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు దక్షిణ మద్య రైల్వే శాఖ సికింద్రాబాద్ ఏడీఆర్ఎం ముత్యాల నాయుడు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ కింద తాండూరు రైల్వే స్టేషన్ ను రూ.24 కోట్లతో ఆధునీకరిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం తాండూరులోని రైల్వే స్టేషన్ ను ఏడీఆర్ఎం ముత్యాల నాయుడు రైల్వే అధికారులతో కలిసి సందర్శించారు. అమృత్ భారత్ కింద తాండూరు రైల్వే స్టేషన్ లో చేపడుతున్న సర్కులేటింగ్ ఏరియా, కాన్ కోర్సు, స్టేషన్ భవనం, ప్లాట్ ఫారం, పార్కింగ్, ఎస్కలేటర్, లిపు తదితర పనుల దశలను సమీక్షించారు.
kvcs
ఆయా పనులు ఏయే దశలో ఉన్నాయని రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. పనులు త్వరితగతిగా పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడీయాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే యేడాది 2026 మార్చిలోగా తాండూరు రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అప్పటిలోగా పనులు నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసేందుకు దృష్టిసారిడం జరుగుతుందన్నారు. దీంతో పాటు రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం.. సమస్యలు పరిష్కరించడంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

స్పెషల్ క్లాసుల రచ్చ..!