రక్తదాత పిలుపుకు స్పందన

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

రక్తదాత పిలుపుకు స్పందన
– లక్ష్యానికి మించి రక్తమిచ్చిన దాతలు
– అభినందించిన డా. సంపత్ కుమార్
– పాల్గొన్న మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రక్తదాతగా పేరుగాంచిన కాంగ్రెస్ సీనీయర్ నాయకులు, శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన రక్తదాన శిభిరానికి మంచి స్పందన లభిచందింది.

శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ లో డా. సంపత్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్ తో కలిసి డా. సంపత్ కుమార్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా ఆసుపత్రికి చెందిన రక్తనిధి కేంద్రం బృందం శిబిరంలో సేవలందించారు. డా. సంపత్ కుమార్ పిలుపు మేరకు రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, యువకులు, మహిళలు రక్తదానం చేశారు.

జిల్లా ఆసుపత్రిలో రక్త నిల్వల కోసం 50 యూనిట్లు అవసరముందనే లక్ష్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా లక్ష్యానికి మించి దాదాపు 60 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. దీంతో రక్తదాత డా. సంపత్ కుమార్ ఇచ్చిన పిలుపుతో చేపట్టిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా డా. సంపత్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను నిలుపవచ్చాన్నారు. రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు నిలిపాలని మన జీవితాలకు ఓ అర్థం ఉంటుందన్నారు. రక్తదానిని అందరు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ మాజీ చైర్మన్ లక్ష్మీరెడ్డి కూతురు బ్రమరాంబ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్, ప్రభాకర్ గౌడ్, వడ్డె శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

శభాష్.. హరీష్ గౌతమ్..!