మృతుల కుటుంబాలకు కాంగ్రెస్‌ అండ 

తాండూరు రాజకీయం వికారాబాద్

మృతుల కుటుంబాలకు కాంగ్రెస్‌ అండ 
– రెండు రోజుల్లోనే పరిహారం మంజూరు చేసిన ప్రభుత్వం
– ప్రతిపక్ష పార్టీల విమర్శలు విడ్డూరం
– కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా నాయకులు ఉత్తమ్ చంద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎప్పుడు అధికారంలో ఉన్న బాధితులు, మృతుల కుటుంబాలకు అండగా నిలవడం జరిగిందని  ఆ పార్టీ వికారాబాద్‌ జిల్లా బీసీ సెల్ నాయకులు ఉత్తమ్ చంద్ అన్నారు. మూడు రోజుల క్రితం చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన తాండూరు వాసుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేశారని ప్రశంసించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హాయాంలో కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయలేక పోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్ఘటన జరిగిన రెండు రోజుల్లోనే మృతుల కుటుంబాలకు పరిహారం మంజూరు చేసిందని అన్నారు. అదేవిధంగా తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామానికి చెందిన వ్యక్తి వరధ ముప్పులో మరణిస్తే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 24 గంటల్లోనే పరిహారం ఇప్పించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. అదే 2022లో ఇదే తరహాలో ఓ వ్యక్తి మరణిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
kvcs
పేదలు, బాధితులు, మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. తాజాగా ఆర్టీసీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 7లక్షల చొప్పున పరిహారం మంజూరయ్యిందని అన్నారు. దురఘటన జరిగిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం పరిహారం అందిస్తే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే రాజకీయాలు పక్కన పెట్టి మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలకు అండగా నిలవడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తాండూరు – వికారాబాద్ రోడ్డును మూడు నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. 15 రోజుల క్రితమే అధికారులకు ఆదేశాలు జారి చేయడం జరిగిందన్నారు. గతంలో బెల్కటూరు బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చిందని అన్నారు.

ఇదికూడా చదవండి…

మృతుల కుటుంబాలకు మనోహరన్న అండ అభినందనీయం