గాజీపూర్ గ్రామస్తుల కన్నెర్ర…!
– గ్రామ రోడ్డును బాగుచేయాలని ఆందోళన
– రోడ్డు గుంత వద్ద యువకుల నిరసన
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : రోడ్డు బాగుచేయాలంటూ పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామస్తులు కన్నెర్ర చేశారు.

శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్ వీరప్ప ఆధ్వర్యంలో గ్రామ సమీపంలోని రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. తాండూరు – సంగారెడ్డి ప్రధాన రోడ్డుపై ఉన్న గుంతలను మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరప్ప మాట్లాడుతూ గాజీపూర్ గ్రామంలోని అప్రోచ్ రోడ్డుకు మట్టివాది సి వదిలేశారన్నారు.

దీంతో బురదగా మారి వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అదేవిధంగా బుద్ధారం నుంచి గాజీపూర్ వరకు గుంతలతో అద్వాన్నంగా మారిందన్నారు. రాత్రిపూట ప్రయాణించాలంటే భయమేస్తుందని వాపోయారు. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి గాజీపూర్ బ్రిడ్జి వద్ద వెంటనే రోడ్డు బాగుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ వెంకటయ్య గ్రామ నాయకులు ముస్తఫా, రఘు, రాజు, లాలు, వెంకట్ గౌడ్, శ్రీను, అంజి, వేణు, చెర్ల అంజి, లాలప్ప లు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

