భళా.. యాలాల జెడ్సీ విద్యార్థులు..!

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

భళా.. యాలాల జెడ్సీ విద్యార్థులు..!
– జాతీయ స్థాయి పోటీలకు ఇద్దరి ఎంపిక
– అభినందించిన హెచ్ఎం, ఉపాధ్యాయులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర స్థాయిలో జరిగిన డిస్కస్ త్రో, అథ్లెటిక్స్ పోటీలలో యాలాల మండలం పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాణించి భళా అనిపించారు. త్వరలో జరిగే జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు.

పాఠశాలలో చదువుతున్న వి. శివకుమార్, డి. సాయికిరణ్ లు ఈనెల 15, 16వ తేదిలలో హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్ లో జరిగిన క్రీడాపోటీలలో పాల్గొన్నారు. అండర్ 14 బాలురు డిస్కస్ త్రో పోటీలో శివకుమార్ 38.75 మీటర్ల దూరంలో వేసి ప్రథమ స్థానంలో నిలిచాడు. అదేవిధంగా సాయికిరణ్ 3 వేల మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. దీంతో వారు జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాజుల సిద్రామేశ్వర్ ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులు శివకుమార్. సాయికిరణ్ లతో పాటు పీడీ రాజశేఖర్ లను సన్మానించారు. అనంతరం హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థులు క్రీడా పోటీలలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పోటీలలో కూడా రాణించి పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, రవీంద్రనాథ్, అర్చన, బ్రమరాంబ, అరుణ, విద్యార్థుల తండ్రులు వెంకటయ్య, గోర్యానాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

టీఆర్ఎస్ఎంఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక