రామ మందిరానికి చేయూత..!
– పునర్ నిర్మాణం కోసం విరాళం
– అందజేసిన తాండూరు వ్యాపారి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని రామ మందిర పునర్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. దేవాలయం పునర్ నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చి తమవంతు చేయూతను అందిస్తున్నారు.

తాజాగా తాండూరు పట్టణంకు చెందిన వ్యాపారి ఎస్పీ నర్సింలు కుమారుడు ఎస్సీ శ్రీకాంత్ విరాళం అందించారు. ఎస్పీ నర్సింలు టెక్స్టైల్స్ ద్వారా రూ. 25వేల ఆర్థిక సాయంను అందించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటి సభ్యులు ఎస్పీ శ్రీకాంత్‌కు ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా రామమందిర పునర్ నిర్మాణానికి వ్యాపారులు, భక్తులు, ప్రజలు ముందుకు వచ్చి.. వస్తు, లేదా ధనరూపేణా సహాకారం అందించి శ్రీరామని కృపను పొందాలని దేవాలయ కమిటి సభ్యులు విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

