తాండూరులో కాంగ్రెస్‌దే పైచేయి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో కాంగ్రెస్‌దే పైచేయి..!
– మనోహరన్న ఇలాఖాలో సెంచరీ గెలుపులు
– ఎమ్మెల్యే ప్రచారానికి విజయాల పరంపర
– కొత్త సర్పంచులకు అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్ట్మాకమైన ఆ పార్టీ మద్దతు అభ్యర్థుల ద్వారా భారీ గెలుపులను సాధించుకుంది. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో పంచాయతీ ఎన్నికల విజయాలు సెంచరీకి చేరువ అయ్యాయి.

హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో తాండూరు నియజకవర్గంలోని కాంగ్రెస్ మద్దతు దారులు పైచేయిని సాధించారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగింది. ఎన్నికలకు ముందే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. తాండూరు నియోజకవర్గంలో సుమారు 25 పంచాయతీలను ఏకగ్రీవం చేసి రికార్డు సృష్టించారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే మేజర్ పంచాయతీ అయిన కరణ్‌ కోట్ గ్రామాన్ని కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవడం చారిత్రాత్మకమైంది. ఇక పోటి తప్పని పంచాయతీలలో అభ్యర్థుల గెలుపుకోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వయంగా ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల్లోని గ్రామాల్లో పర్యటించి ప్రచారం చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ సహాకారంతో ప్రాధాన్యం ఇస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆకట్టుకున్నారు.

ఎన్నికల్లో ప్రతి మండలంలో 22 స్థానాలకు పైగా పార్టీ మద్దతు అభ్యర్థులు విజయం సాధించారు. మనోహర్ రెడ్డి ఇలాఖాలో 100 స్థానాలకు పైగా సర్పంచులు విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ మద్దతు సర్పంచులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభినందించి.. శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పూర్తి సహాకారం అందిస్తామని తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకోసం మనోహర్ రెడ్డి చేసిన కృషికి జేజేలు పలుకుతున్నారు.

ఇదికూడా చదవండి…

పైలెటా.. మజాకా..!