మున్సిపల్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలి
– తాండూరు కార్యాలయం ముందు నిరసన
– మున్సిపల్ కమీషనరుకు వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను, కార్మికులను రెగ్యులైజ్ చేయాలని తాండూరు కార్మికులు డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్త మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మున్సిపల్ లోని కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు దర్నా చేపట్టడం జరిగిందన్నారు. కార్మికులను, ఉద్యోగులను రెగ్యులైజ్ చేయడంతో పాటు 11వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా పెంచిన వేతనాలు అమలు చేయాలని, 18 మంది కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు గోపాల్, తాండూరు అధ్యక్షులు వీరేశం, ప్రధాన కార్యదర్శి భూపతి, సభ్యులు అశోక్, సీహెచ్ అశోక్, శ్రీనివాస్, గోపాల్, శివకుమార్, లాలప్ప, రమేష్, మంజుల, అనిత తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

