తాండూరులో ఫేక్ ఓట్లు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో ఫేక్ ఓట్లు..!
– ఒకే ఇంట్లో 40 మంది ఓటర్లు
– మున్సిపల్ ఓటరు జాబితాలో విచిత్రం
– చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నేతల విజ్ఞప్తి
– దీని వెనుక ఎన్నికల కుట్ర ఉందని ఆరోపణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో ఫేక్ ఓట్లు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో ఒకే ఇంట్లో 43 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితాలో వెలుగులోకి వచ్చింది.

మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో బండారం బయటపడింది. వార్డులో 1-4-9 ఇంటినెంబర్ పై ఈ ఓట్లు నమోదై ఉన్నాయి. ఈ ఇంటి నెంబర్ పై 40 ఓట్లు నమోదై ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. ఈ సంఘటనపై తాండూరు అఖిలపక్షం నేతలు మహమ్మద్ అంజద్, అబ్దుల్ సలాం, అర్షద్, నవాబ్, పాష, సైప్‌, ఇర్ఫాన్, ఖాసిం, మహబూబ్, అబ్రార్, వాజిత్ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఇంటినెంబర్‌పై ఉన్న ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.

పెద్ద సంఖ్యలో ఉన్న ఈ ఓట్లను ఫేక్ ఓటర్లుగానే గుర్తించాలని అభిప్రాయ పడుతున్నారు. ఈ ఫేక్ ఓట్లపై విచారణ జరిగి దొంగ ఓట్లను తొలగించాలని సోమవారం తాండూరు సబ్ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ లను కలిసి ఫిర్యాదులు చేశారు. పట్టణంలోని 3వ వార్డులో రిజర్వేషన్ తమకు అనుకూలంగా తెచ్చుకునేందుకు ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పూర్తి వచారణ జరిగి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదికూడా చదవండి…

గొల్ల చెరువుకు మహర్దశ కల్పించండి..!