వేద పాఠశాల ఏర్పాటు చేస్తాం..!
– భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి సహకరించాలి
– షాపింగ్ కాంప్లెక్స్ పూర్తికి తోడ్పాటు అందిస్తాం
– ఇచ్చిన హామీ మేరకు దాసోహం పూర్తి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వేద పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో భద్రేశ్వర దేవాలయంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

అంతకుముందు దేవాలయంలో భద్రేశ్వర స్వామిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు భద్రేశ్వర దేవాయలయం రూపురేఖలు మారుస్తామని చెప్పి.. ఏమి చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా ఏర్పాటు చేసిన రెనవరేషన్ కమిటి దేవాలయ పురోగతికి కృషి చేసిందని అన్నారు. గతంలో దేవాలయంలో దాసోహం నిర్మించాలని కోరడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అందరి సహాకారంతో దాసోహం నిర్మించడం జరిగిందని గుర్తుచేశారు.

తాజాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై కూడా అడ్డంకులు సృష్టించినా 17 షాపులు పూర్తి చేయడం జరిగిందన్నారు. త్వరలోనే మిగతా షాపులను పూర్తి చేసి తీరుతామన్నారు. 7వ గ్యారెంటీగా వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించను అని హామి ఇచ్చి.. పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్న దేవాలయం అభివృద్ధికి అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్, కమిటి సభ్యులు కోటం సిద్ధలింగం, జొల్లు రోహిణి, శెట్టి సురేష్, కిరణ్ కుమార్, వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్. బస్వరాజ్, కాళికాదేవి దేవాలయ చైర్మన్ పి.బస్వరాజ్, సమాజం సభ్యులు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

