తాండూరును మోడల్‌గా తీర్చిదిద్దుతాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరును మోడల్‌గా తీర్చిదిద్దుతాం..!
– బల్దియాపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే
– రూ.18.7 కోట్లతో పట్టణ అభివృద్ధి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి తాండూరును మోడల్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం యూఐడీఎఫ్ పథకం కింద మంజూరైన రూ.18.7 కోట్లతో తాండూరు పట్టణంలోని వివిధ వార్డులలో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.

పాత పంపు హౌస్, కొత్త పంపు హౌస్, బాలాజీ పార్క్ వద్ద ఉన్న స్థలాల రక్షణతో పాటు అభివృద్ధి పనులు, గొల్ల చెరువు నీటి కాలుష్యం నియంత్రణ కోసం రాఘవేంద్ర దేవాలయం నుంచి ఈద్గా వరకు సీసీ డ్రైన్, పట్టణంలోని పలు వార్డులలో సీసీ డ్రైన్లు, కల్వర్టులు పనులకు ఎమ్మెల్యే పార్టీ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు అభివృద్ధే తన ధ్యేయమని అన్నారు. గత పాలకుల మాదిరిగా శిలాఫలాకాలు వేయకుండా.. మాటలు చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తానని అన్నారు. వర్షాకాలంలో ఇబ్బందిగా మారిన చిలుక వాగును రూ.45 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుగుతుందని, గొల్ల చెరువును పర్యాటక కేంద్రంగా మార్చడం జరుగుతుందని, కాగ్నానది నీటిని ప్రజలకు అందించేందుకు దృష్టిసారిస్తున్నామని వెల్లడించారు. అమృత్ 2.0 కింద రూ.27కోట్లతో వాటర్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుందని గుర్తుచేశారు.

ఎమ్మెల్యేగా తాండూరులో 500ల మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణాభివృద్ధిని గత పాలకులు విస్మరించారని, కొట్లాడుకునేందుకు కౌన్సిల్ సమావేశాలు పెట్టుకున్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. తాండూరు యువతను దృష్టిలో ఉంచుకుని జాబ్ మేళాలు, ఏటీసీ సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు. వచ్చే రెండేళ్లలో తాండూరును మోడల్ గా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, ప్రజలందరు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు అబ్దుల్ రవూఫ్, అఫ్పూ(నయూం), లింగదళి రవికుమార్, వడ్డె శ్రీనివాస్, హబీబ్ లాల, గాజుల మాధవి, మున్సిపల్ కమీషనర్ యాదగిరి, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బీఆర్ఎస్ తడాఖా చూపిస్తాం..!