మురుగు తిష్ట.. తొలగింపు..!
– గాంధీనగర్ లో డ్రైనేజీ క్లీనింగ్
– పనులు చేయించిన బిర్కడ్ జ్యోతి రఘు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం గాంధీనగర్ లో మురుగు కాలువ కంపు.. ముప్పు సమస్య తొలగిపోయింది. ఆదివారం 20వ వార్డుకు చెందిన బిర్కడ్ జ్యోతి రఘు పర్యవేక్షణలో గాంధీనగర్ లోని మురుగు కాలువ పరిశుభ్రత పనులు చేపట్టారు.

గత కొన్ని రోజులుగా గాంధీనగర్ లోని పెద్ద డ్రైనేజీ శుభ్రం చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కంపుతో పాటు దోమలు, ఈగల స్వైర విహారంతో అవస్థలు పడుతున్నారు. స్థానికులు ఈ విషయాన్ని బిర్కడ్ జ్యోతి రఘు దృష్టికి తీసుకవచ్చారు. దీంతో స్పందించి మురుగు కాలువ పరిశుభ్రతకు చర్యలు చేపట్టారు.

జేసీబీ యంత్రం ద్వారా మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని తొలగింపు చేయించారు. మురుగు సవ్యంగా పారేలా శుభ్రం చేయించారు. మురుగు కాలువ సమస్య తీర్చడంతో స్థానికులు బిర్కడ్ జ్యోతి రఘుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు.

ఇదికూడా చదవండి…

