ఎన్నికల గుర్తులు ఖరారు..!
– స్వతంత్రులకు 75 గుర్తులు కేటాయింపు
– అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్లకు గుర్తుల కేటాయింపు ఖరారు అయ్యింది. పార్టీల గుర్తులతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ నెల 3వ తేదీతో నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత బీ-ఫామ్ అందిన అభ్యర్థులకు పార్టీల గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయి స్తారు. మిగిలిన ఇండిపెండెంట్ల కోసం గుర్తులను ఎన్నికల సంఘం విడుదల చేసింది. వీరికి అక్షర క్రమంలో గుర్తులు కేటాయిస్తారు. పార్టీల వారిగా జాతీయ పార్టీలో బీజేపీ (కమలం), కాంగ్రెస్ (హస్తం), ఆమ్మ (చీపురు), బీఎస్పీ (ఏనుగు), ఇండియన్ ముస్లీం లీగ్ (నిచ్చెన), సీపీఎం (సుత్తి కొడవలి, నక్షత్రం) గుర్తులు ఉన్నాయి.

రాష్ట్ర పార్టీ ల్లో ఏఐఎంఐఎం (గాలిపటం), బీఆర్ఎస్ (కారు), వైఎస్ఆర్సీపీ (ఫ్యాన్), టీడీపీ (సైకిల్), రిజిస్టర్ పార్టీల్లో ఫార్వర్డ్ బ్లాక్ (సింహం), సీపీఐ (కంకి కొడవలి), జనసేన (గాజుగ్లాసు) గుర్తులు ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులకు 75 గుర్తులు కేటాయిస్తూ ఎన్నికల సంఘం విడుదల చేయగా.. ఇందులో యాపిల్, గాజులు, ఎయిర్ కండీషన్, బ్యాట్, సీసా, బెలూన్, కెమెరా, బకెట్, ఫుట్బాల్ తదిర గుర్తులు ఉన్నాయి.

ఇదికూడా చదవండి…

