పట్లోళ్ల ప్రచార.. హోరూ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పట్లోళ్ల ప్రచార.. హోరూ..!
– సాయిపూర్ పట్లోళ్ల నర్సింలు, దీప విస్తృత పర్యటన
– బీఆర్ఎస్ బలగమంతా దంపతుల వెంటే
– కారు గుర్తుకు ఓట్లు గుద్దాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్లో పట్లోళ్ల ప్యామిలీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. సాయిపూర్ ప్రాంతానికి చెందిన పట్లోళ్ల నర్సింలు 10వ వార్డు నుంచి పోటీ చేస్తుండగా ఆయన సతీమణి మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు పోటీ చేస్తున్నారు.

మంగళవారం సాయిపూర్ ప్రాంతంలో తొలిసారి పట్లోళ్ల నర్సింలు, దీప దంపతులు ప్రచారం ప్రారంభించారు. 9,10వ వార్డులలో పర్యటిస్తూ ఓటర్లను అప్యాయంగా పలకరిస్తున్నారు. అమ్మా.. బాగున్నావా..? తమ్ముడూ బాగున్నావా..? అక్క, అన్నా వరుసలు కలుపుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే మూడేళ్లలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని గుర్తుచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బంపర్ మేజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. సాయిపూర్ లోని బీఆర్ఎస్ నేతలంతా పట్లోళ్ల నర్సింలు వెంటే కదిలివచ్చారు. 9వ వార్డు, 10 వార్డులోని గడప గడప వద్ద గులాబీ శోభ సంతరించుకుంది.

ఇదికూడ చదవండి…

గులాబీ విధేయులకే పెద్దపీట..!