అమృత్ భారత్‌పై స్పెషల్ ఫోకస్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అమృత్ భారత్‌పై స్పెషల్ ఫోకస్..!
– త్వరితగతిన పనులపై పూర్తికి చర్యలు
– రైల్వే ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి చర్యలు
– దక్షిణ మధ్య రైల్వే శాఖ డీఆర్ఎం డా.గోపాల క్రిష్ణన్
– తాండూరు రైల్వే స్టేషన్ పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వ నిధులతో అమృత్ భారత్ కింద చేపడుతున్న రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలని దక్షణ మద్య రైల్వే శాఖ సికింద్రాబాద్ డీఆర్ఎం డా.గోపాల క్రిష్ణన్ అన్నారు.
kvcs
బుధవారం తాండూరు రైల్వే స్టేషన్ ను ఆయన అధికారులతో కలిసి తనిఖీ చేశారు. తాండూరులో అమృత్ భారత్ కింద రూ. 24 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. స్టేషన్లో వేయిటింగ్ హాల్, ప్లాట్ ఫారం పునరుద్దీకరణ, ఎస్కలేటర్, లిఫ్ట్ తదితర పనులను దశలను సమీక్షించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ కింద చేపడుతున్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. పనులు త్వరిత గతిన పూర్తి చేసి ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు దృష్టిసారిస్తున్నామని తెలిపారు. పనులు పూర్తయితే తాండూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతాయన్నారు. దీంతో పాటు రైల్వే ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి దృష్టిసారిస్తామన్నారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే శాఖ ఉన్నతాధికారులు. తాండూరు రైల్వే స్టేషన్ అధికారులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో ఎక్సప్రెస్ రైళ్లను ఆపాలి