కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం..!
– మున్సిపల్ ఎన్నికల్లో కారుకు ఓటేస్తే వృథా
– తాండూరు అభివృద్ధికి రూ. 600 కోట్లు ఇస్తాం
– ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
– తాండూరు పట్టణ అభివృద్ధే ధ్యేయం
– మున్సిపల్‌పై ఎగిరేది కాంగ్రెస్ జెండానే
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– కాంగ్రెస్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు సక్సెస్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమ జరుగుతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, వికారాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం తాండూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత తాండూరు, గాంధీచౌక్ ప్రాంతాలలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు.

ఈ సమావేశాలకు మంత్రి శ్రీధర్ బాబు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తూ తెలంగాణలో పదేళ్ల తరువాత పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఆదే స్థాయిలో అభివృద్ధి పనులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతున్నాయని అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు. పేదలు అభివృద్ధి చెందకుండా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ తదితర పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. నిరుద్యోగులకు 50వేల ఉద్యోగాల ఇచ్చామని తెలిపారు. త్వరలో మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతన్నాయని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు, కమలంకు ఓటువేస్తే వృదా అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల్లో గెలిస్తే పట్టణంలోని పాత తాండూరు మోడల్ తాండూరుగా మారడం ఖాయమని అన్నారు. తాండూరు అభివృద్ధికి రూ. 600లు కోట్లు ఇస్తామని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మరో రూ. 500ల కోట్లు సాధిస్తారని అన్నారు. సుమారు 1000 కోట్లతో తాండూరు అభివృద్ధి చెందడం ఖాయమని అన్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల్లాగా శంకుస్థాపనలు, టెంకాయలు కొట్టే సంస్కృతి తనకు లేదని, ఇచ్చిన హామిలను నెరవేరుస్తూ దశల వారిగా తాండూరును అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. త్వరలోనే చిలుకవాగు, గొల్ల చెరువు, పాత తాండూరు రైల్వే బ్రిడ్జి పనులు ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. పాత తాండూరు బ్రిడ్జి వల్ల స్థానికులకు గత పాలకుల వల్ల నష్టం జరిగితే.. అధికారంలోకి వచ్చాక పనులలలో మార్పులు చేసి పేదలకు న్యాయం చేయడం జరిగిందన్నారు. బ్రిడ్జి నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. దశాబ్దాల నాటి పైపులైన్ పనులను చక్కదిద్ది తాగునీటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. రానున్న రోజులలో రోజుకు రెండు పూటలా నీటి సరఫరా జరిగేలా చూస్తామన్నారు. మున్సిపల్లో మళ్లీ బీఆర్ఎస్ పగ్గాలు చేపడితే గతంలో రెండేళ్ల మాదిరిగా కోట్లాటలు జరగడం ఖాయమన్నారు. మళ్ళీ దొంగల చేతికి ఇస్తే మున్సిపల్ ను సర్వనాశనం చేస్తారు. ఆలోచించి, అభివృద్ధి కి, కాంగ్రెస్ కి ఓటు వేయాలని కోరారు. పాత తాండూరు, గాంధీ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ల మీటింగ్‌లకు నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ సమావేశాలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బొంతు రామ్మోహన్, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, ముజీబ్ ఖాన్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, జుబేర్ లాల, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదళి రవికుమార్, మాజీ కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్, ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు, ఆయా ప్రాంతాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

