మార్కెట్ కమిటి చైర్మన్‌కు బాల్ రెడ్డి రాజీనామ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్కెట్ కమిటి చైర్మన్‌కు బాల్ రెడ్డి రాజీనామ..!
– కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఒప్పందం మేరకు నిర్ణయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పదవికి పట్లోళ్ల బాల్ రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామను ప్రకటించారు. ఇటీవల జరిగన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన సతీమణి పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎంపికయ్యారు.

ఈ మేరకు పార్టీ అధిష్టానంతో బాల్ రెడ్డి తన మార్కెట్ కమిటి చైర్మన్ పదవిని వదులుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఒకే ఇంటికి రెండు పదవులు రావడం పట్ల పార్టీ నిర్ణయం మేరకు సోమవారం బాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. త్వరలో మార్కెట్‌ కమిటి కొత్త చైర్మన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. కొత్త చైర్మన్‌గా ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్ ను త్యాగం చేసుకున్న సీనియర్ నేతకు నియమించే అవకాశాలు ఉన్నాయి.

ముక్కంటి సేవలో బుయ్యని సరళా రెడ్డి