పార్టీలకతీతంగా పాలనే ధ్యేయం..!
– అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయండి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యేను కలిసిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో పార్టీలకతీతంగా పాలనే ధ్యేయంగా ముందుకు సాగుతూ.. అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని తాండూరు మున్సిపల్ నూతన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా అవకాశం కల్పించడం పట్ల నీరజా బాల్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. బాల్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అరుణా రెడ్డి దంపతులను సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణంలో పార్టీలకతీతంగా పాలన అందించాలని సూచించారు. అన్ని వార్డులను అభివృద్ధి పరిచేసేందుకు, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. పట్టణ అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తామని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నీరజా బాల్‌రెడ్డి తెలిపారు.


