తాండూరు అభివృద్ధే ఎజెండా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు అభివృద్ధే ఎజెండా..!
– పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
– సవితి ప్రేమ లేకుండా సమానంగా వార్డు ప్రగతి
– సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో రూపు రేఖలు మారుస్తాం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– పట్టణాభివృద్ధికి పట్టుదలతో పనిచేస్తాం
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధే అజెండాగా పనిచేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. సీఎం రేవంత్‌ రెడ్డి సహాకారంతో తాండూరుకు అధిక నిధులు తీసుకవచ్చి రూపు రేఖలు మార్చే విధంగా తోడ్పాటు అందిస్తానని అన్నారు.

సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌ల పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో పట్లోళ్ల నీరాజ బాల్‌రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో ఎన్ని కుట్రలు జరిగినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి మెజార్టీతో గెలిపించారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలకవర్గం ప్రజలకు సేవలందించాలని అన్నారు.

అదేవిధంగా తాండూరు పట్టణంలో వార్డుల అభివృద్ధికి సంపూర్ణ సహాకారం అందిస్తామని అన్నారు. మిషన్‌ భగీరథకు ప్రత్యామ్నాయంగా తాండూరు ప్రజలకు కాగ్నానీటిని సరఫరా చేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు పట్టణంలో తాగునీటి కష్టాలు రాకుండా ఉండేందుకు అమృత్‌ 2.0 కింద పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా అండర్‌ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంకు సీఎం రేవంత్ రెడ్డి పరిగి సభలో మాట ఇచ్చారని గుర్తుచేశారు. త్వరలోనే టెండర్లు జరుగుతాయని అన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఇచ్చిన హామిలకంటే చేసిన అభివృద్ధే ప్రజల ముందు కనిపిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో అత్యధిక నిధులు తీసువచ్చి.. విజన్‌ 2028 నాటికి తాండూరు రూపు రేఖలు మార్చేవిధంగా కృషి చేస్తామని అన్నారు. అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి పరుస్తామని, ఏ వార్డుపై సవతి ప్రేమ చూపించబోమని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి మాట్లాడుతూ సీఎం, ఎమ్మెల్యేల సహాకారంతో తాండూరును అభివృద్ధి చేయడమే పట్టుదలగా భావిస్తామని అన్నారు. గతంలో ఉన్న పాలకవర్గంతో ప్రజలు విసిగిపోయారని, కొట్లాలు తప్పా అభివృద్ధి జరగలేదని అన్నారు. మున్సిపల్ చైర్‌ పర్సన్‌గా రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు అవకాశం దక్కిందని, దానికి చెడ్డపేరు రాకుండా పనిచేస్తామని అన్నారు. అందరు కౌన్సిలర్లు, అధికారులతో కలిసి పట్టణంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.

కార్మికులతో కలిసి భోజనం
పదవి బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్యాలయంలో భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌లు మున్సిపల్ కార్మికులతో కలిసి భోజనం చేశారు. భోజనం చేస్తూనే కార్మికులతో ముచ్చిటిస్తూ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్, పట్లోళ్ల నర్సింలు, నయూం(అఫ్పూ), మాజీ కౌన్సిలర్ మమత, గాజుల మాధవి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

టీజర్, సినిమా రెండూ చూపించా..!