తాండూరులో వైభవంగా ఉగాది

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో వైభవంగా ఉగాది
– ఇంటింటా షడ్రుచుల పచ్చడి
– భద్రేశ్వర దేవాయలంలో పంచాగ శ్రవణం
– పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– శుభాకాంక్షలు తెలిపిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఉగాది వేడుకలను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సరంను పురస్కరించుకొని అంతటా వేడుకలు వైభవంగా నిర్వహించుకున్నారు. ఉగాది పర్వదినంతో పలు దేవాలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తుల తాకిడి కనిపించింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. ఉగాది పండను పురస్కరించుకొని ప్రతి ఇంట్లో ఉగాది పచ్చడి సందడి చేసింది. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ప్రతి ఇంటా చిన్నలు, పెద్దలు సేవించి సంబరంగా పండుగను జరుపుకున్నారు.

భద్రేశ్వర దేవాలయంలో పంచాగ శ్రవణం
తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో పంచాగ శ్రవణం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ నేతలు, ప్రముఖులతో కలిసి హాజరయ్యారు. వేద పండితులు పఠించిన పంచాగ శ్రవణం మనోరంజకంగా కొనసాగింది.

ఈ యేడాది జరిగే శుభాలు, కష్టాలను వివరించారు. పలు రాశుల ఫలితాలను కూడా వివరించారు. రైతులకు, రాజీకీయ నాయకులకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో చెడు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌ రెడ్డి, దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్, జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులు మేడి మహేష్‌, కాంగ్రెస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు డా.సంపత్ కుమార్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మహిళ నాయకురాలు గాజుల మాధవి, జాతర ఉత్సవ కమిటి సభ్యులు గంగా శ్రావణ్ కుమార్, గాజుల విజయ్ కుమార్, లింగమంతుల శంకర్, శెట్టి చంద్రకాంత్, మద్రికే చంద్రకాంత్, కోర్వార్ అంజలి, అగ్గనూర్ సంకేత్, వీరశైవ సమాజం, యువదళ్ సభ్యులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
మరోవైపు తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు.

పట్టణంలో జరిగిన ఓ ఉత్సవంలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, చేపట్టిన ప్రతి మంచి పనిలో అందరికీ విజయం చేకూరాలని, ప్రతి పండుగ ఇదే విధంగా అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, గోపాలకృష్ణ బాగ్రే, పుర ప్రముఖులు, పెద్దలు, ఆర్యసమాజ్, హిందూ వాహిని, ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

భద్రేశ్వర జాతర ఉత్సవాలకు అంకురార్పణ