శ్రీరామ మందిరానికి రూ. 1లక్ష విరాళం

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీరామ మందిరానికి రూ. 1లక్ష విరాళం
– ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్‌ అసోసియేషన్ సేవా తత్పరత
– కృతజ్ఞతలు తెలిపిన దేవాలయ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని ఏకైక శ్రీరామ మందిరంకు రూ.1లక్ష విరాళం అందింది.

శుక్రవారం తాండూరుకు చెందిన ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఈ విరాళంను అందజేశారు. గత కొన్ని రోజులుగా ఇందిరా నగర్‌ రామమందిర్ పునర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాతల సహాకారంతో శ్రీరాములోరికి కొత్త గుడిని కట్టిస్తున్నారు. ఇందులో భాగస్వామ్యం కావాలని దేవాలయ కమిటి సభ్యులు దాతలను ఆశ్రయిస్తున్నారు.

ఈ మేరకు ది గ్రేన్ అండ్స్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు రూ.1లక్ష విరాళం అందజేసి పునర్‌ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో శ్రీరామ మందిరానికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటి సభ్యులు అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సోమవారం నుంచి జరిగే ఉత్సవాలలో పాల్గోనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సహా కార్యదర్శి భోజిరెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీధర్, సభ్యులు మంకాల రవీందర్, సాంబూరు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

కాశీ విశ్వేశ్వర యాత్రకు తాండూరు భక్తులు