బీఆర్ఎస్‌వే వసూలు రాజకీయాలు
– ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై దుమ్ము
– అర్హులైన పేదలకు సొంత ఇండ్లు
– దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు
– కాంగ్రెస్ యువ నాయకులు బిడ్కర్ రఘు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీనే వసూళ్ల రాజకీయాలు చేసిందని కాంగ్రెస్ పార్టీ తాండూరు యువ నాయకులు బిడ్కర్ రఘు అన్నారు.

కాంగ్రెస్ పార్టీపై తాండూరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేసిన వాఖ్యలను ఖండించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డిల నాయకత్వంలో అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఉనికిని కోల్పోతున్నామన్న అభద్రతా భావంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. గతంలో ఇదే డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ నేతలే వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.

అదేవిధంగా దళిత బంధు, బీసీ బంధు ఇతర పథకాల్లో వసూళ్లకు పాల్పడి అర్హులైన పేదలకు అన్యాయం చేశారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ప్రజాపాలన ద్వారా అర్హులైన పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. సొంతింటి నిర్మాణాలు, మంజూరుకు కృషి చేస్తుందని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే ఆధారంగానే లబ్ధిదారులను ఎల్1, ఎల్2, ఎల్3 కేటగిరీలుగా విభజించడం జరిగిందని, అర్హులైన పేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కావాలనే కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోసే రాజకీయాలు చేయడం మానుకోవాలని, లేని పోని రాద్దాంతాలు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.


