రాజ్‌పుత్ సమాజానికి అండగా ఉంటా..!
– కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తోడ్పాటు హామి
– చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి భరోసా
– శిలా ఫలకం ధ్వంసం ఘటన పరీశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని రాజ్‌పుత్ సమాజానికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు.

తాండూరు పట్టణం ఇందిరానగర్ వార్డు నెంబర్ 5లో బొందలి రాజ్‌పుత్ సమాజం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన శిలా ఫలాకాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పట్టణ సీఐతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం సమాజం సభ్యులతో మాట్లాడుతూ రాజ్‌పుత్ సమాజం సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆదేవిధంగా రాజ్‌పుత్ సమాజం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామని భరోసా అందించారు. త్వరలోనే నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాజం గౌరవాధ్యక్షులు ఠాకూరు సుభాష్ సింగ్, అధ్యక్షులు దిలీప్ సింగ్, జిల్లా మహిళ అధ్యక్షురాలు నిఖిత ఠాకూర్, సభ్యులు పల్లి ఠాకూర్, ఉపాధ్యక్షులు ఠాకూర్ ఉమేష్ సింగ్, ఠాకూర్ ప్రభాకర్ సింగ్, ఠాకూర్ నర్సింగ్ సింగ్, ఠాకూర్ రాజు సింగ్, రాజ్‌పుత్ యువదళ్ అధ్యక్షులు ఠాకూర్ దీపక్ సింగ్, ఠాకూర్ శివాజీ సింగ్, లకన్ ఠాకూర్, సురేష్ ఠాకూర్, సభ్యులు తదితరులు ఉన్నారు.


