ప్రభుత్వ భూమిలో అక్రమాలు బయటపెడతాం

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రభుత్వ భూమిలో అక్రమాలు బయటపెడతాం
– అన్ని సాక్షాలతో నిరూపించే బాధ్యత మాది
– దోషులపై పీడీ యాక్టుతో జైలుకు పంపాలి
– తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం మున్సిపల్ ముందు ఉన్న సర్వేనెంబర్ 130లో అక్రమాలను బయటపెట్టి ప్రభుత్వ భూమిగా నిరూపిస్తామని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్ అన్నారు.

సర్వేనెంబర్ 130లోని 36 గుంటల భూమి ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూమి అని పేర్కొన్న అబ్దుల్ అహద్ వాఖ్యలను ఆయన ఖండించారు. అది ముమ్మాటికి ప్రభుత్వ భూమే అని అన్నారు. ఇట్టి భూములను ఆక్రమించుకోవడం ప్రజల ఆస్తిని దోచుకోవడమే అని అన్నారు. ఇందులో ఉన్న అక్రమాలను బయటపెట్టి తీరుతామని అన్నారు.

ఇప్పటికే ఈ భూమికి సంబంధించిన ఆధారాలను మున్సిపల్ కమీషనర్‌కు అందించడం జరిగిందని తెలిపారు. తగిన సాక్షాధారలతో బహిర్గతం చేస్తామని అన్నారు. ఇందులో అధికారుల పాత్ర ఉన్నా కూడా, ఎంతటి పెద్ద మనుషులు ఉన్నా కూడా వదిలేదని లేదని అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని అన్నారు.

అదేవిధంగా అది ప్రభుత్వ భూమి కాదు.. పట్టా భూమి అని తగిన ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. పట్టణంలో ఎక్కడైనా అక్రమాలు జరిగేలా అడ్డుకుని తీరుతామని, అది బాధ్యత అని అన్నారు. అక్రమాలకు ముగింపు పలికే వరకు పోరాటం ఆగదని అన్నారు.

చిరు వ్యాపారులకు దుకాణాలు..!