వెండితో వాసవీ మాత విగ్రహం
– నగరేశ్వర దేవాలయానికి వితరణ
– విరాళంగా అందజేసిన ఆర్యవైశ్య సంఘం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వాసవీ మాతపై ఉన్న భక్తిని తాండూరు ఆర్యవైశ్య సంఘం సభ్యులు చాటుకున్నారు. వెండితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించారు.

శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సభ్యులు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కుల దేవత వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాల్లో భాగంగా వెండితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించడం జరిగిందని తెలిపారు. సుమారు మూడున్నర కిలోలతో అమ్మవారి ఉత్సవ వెండి విగ్రహాన్ని ఆలయానికి అందించడం జరిగిందని తెలిపారు.

అంతకుముందు అమ్మవారి వెండి విగ్రహాన్ని సంఘం కార్యాలయం నుంచి ఊరేగింపుగా దేవాలయం వరకు తీసుకవచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కోట మురళి కృష్ణ, కార్యదర్శి కోట్రిక కిరణ్ కుమార్, దేవాలయం చైర్మన్ దాదాపురం సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు గుబ్బ యాదయ్య, సహ కార్యదర్శి గౌరీ శంకర్, కోశాధికారి విజయ్ కుమార్, మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులు, గుబ్బ ప్రగతి, తాళ్లపల్లి కవిత, వేముల పల్లవి, యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులు తర్లపల్లి భాను కుమార్, చీకటిమల్ల పునీత్, కల్వరాజ వంశీ, సంఘం మాజీ అధ్యక్షులు కల్వ మనోహర్, కోస్గి తిప్పయ్య, కట్కం వీరేందర్, మాజీ కార్యదర్శి సల్లా దామోదర్, కుంచం మురళీధర్, సంఘ జిల్లా పెద్దలు భీమ్ శెట్టి అనిల్ కుమార్, కల్వ రవికుమార్, దేవగారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.


