మాంసం వ్యర్ధాల టెండర్ రద్దు

తాండూరు రాజకీయం వికారాబాద్

మాంసం వ్యర్ధాల టెండర్ రద్దు
– బహిరంగ వేలంకు కొత్త తేది ఖరారు
– ప్రకటించిన మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో చికెన్, మటన్, ఫిష్ వ్యర్థాల సేకరణ, రవాణా కోసం నిర్వహించిన బహిరంగ వేలంను రద్దు చేసినట్లు కమీషనర్‌ మధుసూదన్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈనెల 7న తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మాంసం వ్యర్థాల సేకరణ, రవాణా కోసం వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎజాజ్, అబ్దుల్ రహీంలు పోటీ పడ్డారు. ఎజాజ్ రూ. 17లక్షల 7 వేలు పాడగా.. అబ్దుల్ రహీం రూ. 20లక్షలకు వేలం పాడి టెండర్ను దక్కించుకున్నారు.

నిబంధనల ప్రకారం వేలం దక్కించుకున్న వ్యాపారి 7 పనిదినాలలో వేలంలో పాడిన డబ్బులు మున్సిపల్‌కు చెల్లించాలి. గడువు దాటి ఇన్ని రోజులు అయినా వ్యాపారి డబ్బులు చెల్లించలేదు. అయితే వేలం దక్కించుకున్న వ్యాపారి డబ్బులు చెల్లించకపోతే రెండో స్థానంలో ఉన్న వ్యాపారి కూడా ఈ టెండర్‌ను తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో టెండర్‌ను రద్దు చేసినట్లు కమీషనర్‌ స్పష్టం చేశారు. వచ్చే నెల 5వ తేదిన మళ్లీ కొత్తగా బహిరంగా వేలం చేస్తామని తెలిపారు.

వెండితో వాసవీ మాత విగ్రహం