నామినేటేడ్ పదవుల్లో తాండూరు నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

నామినేటేడ్ పదవుల్లో తాండూరు నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి
– టీపీసీసీ అధ్యక్షులను కోరిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ముందు వరసులో ప్రభాకర్‌ గౌడ్‌కు అవకాశం కల్పించాలి
తాండూరు, దర్శిని ప్రతినిధి : నామినేటేడ్ పదవులలో తాండూరు నేతలకు ప్రాధాన్యత కల్పించాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కోరారు.

గురువారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్ గౌడ్‌ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్లతో పాటు సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగిందని వివరించారు.

పార్టీ గెలుపుకు కృషి చేసిన తాండూరు సీనియర్ నాయకులకు రానున్న నామినేటేడ్ పదవులలో అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యంగా తాండూరు పట్టణానికి చెందిన ప్రభాకర్ గౌడ్ పార్టీకి మూడు దశాబ్దాలుగా పార్టీలో క్రీయశీలకంగా పని చేస్తూ పట్టణ అధ్యక్షులుగా, ప్లోర్ లీడర్ గా, కౌన్సిలర్ గా సేవలను అందించారని తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులుగా పార్టీ లో గుర్తింపు ఉన్న ప్రభాకర్ గౌడ్ కు రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రభాకర్ గౌడ్ పార్టీకి అందించిన సేవలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించారు. ఇందుకు టీపీసీసీ అధ్యక్షులు సానూకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బర్కత్ అలీ తదితరులు ఉన్నారు.

బాలికపై యువకుడి అత్యాచారం