ఎమ్మెల్యేగారు ఎంసీహెచ్‌పై దృష్టి సారించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యేగారు ఎంసీహెచ్‌పై దృష్టి సారించండి
– వైద్య సేవల్లో వైద్యుల నిర్లక్ష్యం
– వారి ప్రైవేటు ఆసుపత్రులకే ప్రాధాన్యం
– మున్సిపల్ కౌన్సిలర్ జావిద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్)పై స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టి సారించాలని రాజీవ్ కాలనీ మున్సిపల్ కౌన్సిలర్ జావిద్ అన్నారు.

సోమవారం ఎంసీహెచ్‌ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ వైద్యులు పేదలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం అయితే వైద్యులు స్పందించడం లేదని, అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారని అన్నారు.

ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు వారి ప్రైవేటు క్లీనిక్‌లలో పనిచేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ పనిచేసే దానికంటే అక్కడే విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. కొత్త వైద్యులు రాకుండా కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాతా శిశు ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

రోగులకు 24 గంటలు వైద్య సేవలు అందించేలా చూడాలని, మౌళిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రైవేటుకు ప్రాధాన్యమిచ్చే వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి