మేకపై కొండ చిలువ దాడి..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మేకపై కొండ చిలువ దాడి..!
– కొట్టు మిట్టాడుతూ మేక మృతి
– కొండ చిలువను కొట్టి చంపిన స్థానికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మేత మేస్తున్న మేకపై కాపు వేసిన కొండ చిలువ దాడి చేసింది.

ఈ పెనుగులాటలో మేక మృత్యువాత పడింది. భయాందోళన చెందిన స్థానికులు కొండ చిలువను దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన గురువారం తాండూరు మండలం లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సంగెం కలాన్ గ్రామానికి చెందిన ఓ మేకల కాపరి మేకలను కాసేందుకు గ్రామ సమీపంలోకి తీసుకెళ్లాడు.

మందలోని ఓ మేకపై అక్కడ సమీపంలో కాపు కాసిన కొండ చిలువ అకస్మాత్తుగా దాడి చేసింది. మేకను చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసింది. కాపరి కేకలు వేశాడు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు.

కొండ చిలువ నుంచి మేకను విడిపించేలోపు మేక మృతి చెందింది. భయాందోళనకు గురైన స్థానికులు స్వీయ రక్షణ కోసం కొండ చిలువను దాడి చేసి హతమార్చారు.

 

బక్రీద్ పండుగ శుభాకాంక్షలు