తిందామంటే.. ఇదేం ‘దుర్గ’తి..!
– హోటల్లో మున్సిపల్ అధికారుల తనిఖీలు
– నాసిరకం ఆహార పదార్థాలు స్వాదీనం
– నిర్వహాకులకు నోటీసులు జారీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : రుచిగా తిందామని హోటల్‌కు వెళితే.. దుర్గంధమైన ఆహార పదార్థాలు దర్శనమిచ్చే సంఘటనలు ఎదురవుతున్నాయి.

తాజాగా తాండూరు పట్టణం చించొల్లి రోడ్డు మార్గంలోని దుర్గా బార్ అండ్ రెస్టారంట్ హోటల్లో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఈ హోటల్లో నాసిరకం ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారని సామాజిక మాద్యమాలలో ప్రచారం జరిగింది.

ఈ మేరకు గురువారం తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్ రాములు, సిబ్బందితో కలిసి హోటల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో నిర్వహకులు ఒక రోజు క్రితం చికెన్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాదీనం చేసుకున్నారు.

అనంతరం హోటల్ నిర్వహకులకు నోటీసులు జారీ చేశారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఈఈ ప్రవీణ్ గౌడ్, జవాన్లు సిహెచ్ అశోక్, బొట్టు శ్రీను, రమేష్ తదితరులు ఉన్నారు.


