ప్రాణం తీసిన అక్రమ సంబంధం
– రాయితో మోది భార్యను చంపిన భర్త
– తాండూరు మండలం అల్లాపూర్‌లో ఘటన
– కేసు నమోదు చేసిన కరణ్ కోట్ పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : భార్య వెరోకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అదే ఆమె ప్రాణాలను బలితీసుకుంది. మానుకోవాలని చెప్పిన వినకపోవడంతో భార్యను రాయితో మోది హత్యకు కారకుడు అయ్యాడు భర్త.

బతుకు దెరువు కోసం వచ్చిన వలస కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ సంఘటన తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కరణ్ కోట్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లా వాసి అయిన జీరో రిషి, తన భార్య సరీతా దేవి (33), కుమారుడు రాజుతో కలిసి తాండూరు ప్రాంతానికి వలస వచ్చారు.

మండలంలోని అల్లాపూర్ గ్రామంలో ఉన్న వీఆర్ పాలిషింగ్ యూనిట్లో 6నెలులగా కార్మికులుగా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రిషి భార్య సరీతా దేవి, అల్లాపూర్ గ్రామంలోని భాస్కర్ రెడ్డి పాలిషింగ్ యూనిట్లో పని చేస్తున్న కార్మికుడు తోఫిక్ ఆలంతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై భార్యాభర్తలిద్దరూ గొడవలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధం మానుకోవాలని రిషి భార్య సరితాదేవికి పలుమార్లు హెచ్చరించాడు. కానీ ఆమె తన భర్త మాట వినకుండా పద్దతి మార్చుకోలేదు.

మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో సరీతా దేవితో తోఫిక్ ఆలం మధ్య ఉన్న సంబంధం విషయమై మళ్లీ గొడవ పడ్డారు. ఈక్రమంలో రిషి తన భార్య సరితాదేవిపై రాయితో దాడి చేశాడు. తర్వాత అతను తన యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అనంతరం రక్తపు మడుగులో ఉన్న సరితాదేవిని చికిత్స కోసం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కరణ్ కోట్ పోలీసులు భర్త రిషిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నిందితుడు రిషిని కస్టడీ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నట్లు వెల్లడించారు.


