జిల్లా ఆసుపత్రి ఆప్‌గ్రేడ్‌ను స్వాగతిస్తున్నం

తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లా ఆసుపత్రి ఆప్‌గ్రేడ్‌ను స్వాగతిస్తున్నం
– దవాఖానాపై అపోహలు నమ్మొద్దు
– డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల కృషితో తాండూరు ప్రజల 60 ఏండ్ల కళ నెరవేరబోతోందనీ కాంగ్రెస్ పార్టీ వికారాబాద్‌ జిల్లా(డీసీసీ) ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గురువారం ఆయన మాట్లాడుతూ తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ నుంచి మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌లోకి మార్చడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల సహాకారంతో నెరవేరుతోందని అన్నారు.

రూ.150 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టినందుకు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఆసుపత్రిపై వస్తున్న అపోహలను నమ్మొద్దని సూచించారు. ఆసుపత్రిని మూసివేయడం కాదు, 100 పడకల నుండి 300 పడకలకు మారుస్తున్నట్లు వెల్లడించారు. 15 మంది డాక్టర్ల నుండి 200 మంది డాక్టర్లకు పెంచడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సేవలు తాండూర్‌కు ఎంతో అవసరమని, ఒక్క ఉద్యోగిని కూడా బదిలీ చేయడం జరగదని అన్నారు. ఇప్పుడు ఉన్నవారితో పాటు 185 మంది కొత్త డాక్టర్లు, 500 మంది సిబ్బంది అదనంగా వస్తారని తెలిపారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మాత్రం కావాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. తాండూరు వర్సెస్ కొడంగల్ అంటూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని అన్నారు.

జిల్లా ఆసుపత్రి భవిష్యత్తుపై స్పష్టత ఏది..!