హిందూ ఉత్సవ సమితికి విరాళం

తాండూరు రాజకీయం వికారాబాద్

హిందూ ఉత్సవ సమితికి విరాళం
– రూ.51 వేలు అందజేసిన విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోయే వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు హిందూ ఉత్సవ సమితికి తాండూరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వర్య్తా విఠల్‌ నాయక్‌ రూ.51 వేల విరాళం అందజేశారు.

తాండూరులో ప్రతి ఏటా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం విఠల్‌ నాయక్ తనవంతు సహకారం అందజేశారు. ఈ సందర్భంగా విఠల్‌ నాయక్‌ మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఉత్సవాల నిర్వహణలో కమిటీ సభ్యులు చేస్తున్న కృషికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. వినాయక చవితి వేడుకలు విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.

విరాళం అందించిన విఠల్‌ నాయక్‌కు హిందూ ఉత్సవ సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి బిర్కట్‌ రఘు, కోశాధికారి అంతారం కిరణ్‌, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

హామిల అమలులో సర్కారు విఫలం