ఫ్రెండ్‌ను హత్యచేసిన స్నేహితుల జ్యూడిషనల్ రిమాండ్
– ప్రకటన విడుదల చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సెల్ ఫోన్ వివాదంలో ఫ్రెండును హత్య చేసిన ఇద్దరు నిందితులను తాండూరు పోలీసులు జ్యూడిషనల్ రిమాండుకు తరలించారు. తాండూరు సర్కిల్ పోలీసులు ఈ కేసు వివరాలను శనివారం విడుదల చేసిన ఓ ప్రకటలో వెల్లడించారు. తాండూరు పట్టణానికి చెందిన ఆకీబ్ ఈనెల 8న డిగ్రీ పరీక్ష రాజేందుకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. అక్కడే తన సెల్ ఫోన్‌ను బైకు టూల్ బాక్సులో దాచి పెట్టగా తాండూరు పట్టణానికి చెందిన ప్రశాంత్(17) అనే మైనర్ బాలుడు ఈ సెల్ ఫోన్ ను దొంగలించాడు. మరుసటి రోజు ఈ సెల్ ఫోన్ ను విక్రయించాలని ప్రశాంత్ తన స్నేహితులైన రాజు, జగ్వంత్ లకు అప్పగించాడు. అప్పటికే ఫోన్ ను కోల్పోయిన ఆకీబ్ తన ఫోన్ పోయిందని తెలిస్తే సమాచారం అందించాలని వాట్సాప్ లలో ఫోటోలు షేర్ చేశాడు. ఇది తెలియని రాజు, జశ్వంత్ లు ఫోన్ ను విక్రయించేందుకు అజార్ అనే మోబైల్ షాపుకు వెళ్లారు. ఫోన్ ను గమనించిన అతను దొంగ ఫోన్‌ను అమ్ముతారా అంటూ వారిని బెదిరించడంతో తమ స్నేహితుడు ప్రశాంత్ ఇచ్చాడని చెప్పారు. దీంతో ఫోన్ ను వద్ద ఉంచుకుని ప్రశాంత్ ను తీసుకురమ్మని వారిని అక్కడి నుంచి సంపించారు. ప్రశాంత్, రాజు, జశ్వంత్ లు రావడంతో వారిని మందలించి పంపించారు.
దొంగలుగా మార్చాడని కోపంతో…
ఇతరుల ముందు తమను దొంగలుగా మార్చాడని రాజు, జశ్వంత్ లు ప్రశాంత్ పై కక్ష్య పెంచుకున్నారు. అదేరోజు సాయంత్రం రాజు, జశ్వంత్ లు మాట్లాడుదామని ప్రకాంత్ ను పిలిపించుకుని పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. అక్కడ మా చేత దొంగ ఫోన్ ను అమ్మించాలని చూస్తావా అంటూ రాజు, జశ్వంత్‌లు ప్రశాంత్ పై మండిపడ్డారు. ఈక్రమంలో ముగ్గురి మధ్య మాట్లా మాట పెరిగింది. దీంతో రాజు, జశ్వంత్ లు ప్రశాంత్ ను కొట్టగా సృహతప్పి పడిపోయాడు. అనంతరం రాజు, జశ్వంత్‌లు ప్రశాంత్ తలపై బండరాయితో దాడి చేసి హత్య చేశారు. మృతుని తండ్రి దంగు వెంకటయ్య ఫిర్యాదు మేరకు పెద్దేముల్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందతులను శనివారం అరెస్టు చేసి జ్యూడిషనల్ రిమాండుకు తరలిస్తున్నట్లు తాండూరు డీఎస్సీ లక్ష్మీనారాయణ తెలిపారు.


