జిల్లా యువ క్రికెటర్లకు సూపర్ ఛాన్స్‌

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లా యువ క్రికెటర్లకు సూపర్ ఛాన్స్‌
– జిల్లా అండర్‌-19 క్రికెట్‌ జట్టులో చోటుకు అవకాశం
– 11న అనంతరెడ్డి గ్రౌండ్‌లో సెలక్షన్స్‌
– తెలంగాణ క్రికెట్ అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని యువ క్రికెటర్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) సూపర్ ఛాన్స్‌ అందించేందుకు సిద్దమయ్యింది.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఏ) అండర్‌-19 రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న లీగ్‌ మ్యాచ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నారు. అక్టోబర్‌ 12 నుంచి వరంగల్‌లో ప్రారంభమయ్యే ఈ టోర్నీలో పాల్గొనే వికారాబాద్‌ జిల్లా జట్టు ఎంపికలను ఈనెల 11న నిర్వహించనున్నట్లు టీసీఏ ప్రతినిధులు తెలిపారు.

జిల్లా కేంద్రంలోని అనంతరెడ్డి గ్రౌండ్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంపికలు జరగనున్నాయి. ప్రతిభ కలిగిన జిల్లాలోని యువ ఆటగాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోచ్‌లు జగన్నాథ్‌రెడ్డి, సతీష్‌ సూచించారు. మే 2007 నుంచి డిసెంబర్‌ 2009 మధ్య జన్మించిన వారు ఎంపికలకు హాజరుకావడానికి అర్హులని టీసీఏ వికారాబాద్‌ జిల్లా కార్యదర్శి పి. శరత్‌ సింగ్‌ తెలిపారు.

అభ్యర్థులు వైట్‌ జెర్సీ, క్రికెట్‌ కిట్‌, ఆధార్‌ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 9177357907, 9177847227, 9177417854 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

మహిళలకు శుభవార్త..!